ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో  డేరింగ్‌కి కేరాఫ్‌ అడ్రెస్‌ సంజయ్‌ దత్‌. నటన విషయంలోకానీ, యాక్షన్‌ విషయంలో కానీ, సినిమాల ఎంపికలో సమయంలో కానీ డేరింగ్‌తో డెసిషన్స్‌ తీసుకొని సినిమాలు చెయ్యగలిగే నటుడు.సంజు  జీవితంలో వ్యక్తిగతంగా చాలా కష్టాలు, ఇబ్బందులు పడ్డాడు.కాని ఎప్పుడు ఆ ఎఫెక్ట్ సినిమాలపై చూపించకుండా డేరింగ్ గా మూవీస్ చేశాడు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితుల్ని కూడా పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు.తన హెల్త్ కండిషన్స్ ని పట్టించుకోకుండా  గతంలో ఉన్న సంజయ్‌ దత్‌ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సన్నివేశాలు రాసుకోండి అని మేకర్స్ కి సూచిస్తున్నాడు.ఇంతకీ ఏమైందంటే ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలో సంజయ్‌ దత్‌ అధీర అనే మెయిన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలోనే సంజూ బాబా మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈలోగా అతనికి క్యాన్సర్‌ రావడంతో వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయారు. కోలుకొని ఇటీవల తిరిగి వచ్చారు. ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్నారు కూడా. అయితే అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం స్టంట్స్‌ విషయంలో మార్పులు చేసిందట. ఆ విషయంలో సంజూ బాబా అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం. ‘‘సినిమా కోసం గతంలో రూపొందించుకున్న యాక్షన్‌ సన్నివేశాలను నేను చేయలేనని అనునకొని నన్ను అవమానించకండి. ఇంతకుముందు అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం.నా కోసం స్టంట్స్‌లో ఎలాంటి మార్పలూ చేయకండి. పని విషయంలో నేను ఎప్పుడూ రాజీపడను. ఇప్పుడు కూడా రాజీపడేది లేదు’’ అని చిత్రబృందంతో చెప్పాడట సంజయ్‌ దత్‌.ఇక దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ జనవరి 8న రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: