టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల సరసన నటించి చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నయనతార.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన నటనతో వరుస విజయాలతో అక్కడ కూడా టాప్ ప్లేస్ ని కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ దర్శకుడితో చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే..  2015 లో వచ్చిన తమిళ చిత్రం 'నానుమ్ రౌడీ ధాన్' షూటింగ్ సందర్భంగా నయనతార..ఆ సినిమా దర్శకుడు  విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారి డేటింగ్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఫ్యాన్స్ లైక్ చేయడం కామన్ అయిపోయింది.ఇదిలా ఉంటె లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం..

 వారిద్దరూ అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని తెలుస్తోంది.తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీరి సహజీవనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి వివాహం గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సంవత్సరమే వారిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.కోలీవుడ్ మీడియా ప్రకారం విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారట.

ఈ పెళ్లి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఈ వేడుక భారీగా నిర్వహించట్లేదట. కేవలం పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను తమ వివాహానికి ఆహ్వానిస్తారని సమాచారం. వీరి వివాహం త్వరగా జరగాలని ఇద్దరి తల్లిదండ్రులు కోరుకుంటున్నారని అందుకే వీరు త్వరగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని లేదంటే.. మరికొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఈ జంట ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'కథువాకుల రెండు కాదల్' చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: