ఆ ఈవెంట్ లో సరదాగా తాడు లాగే పందెం పెట్టారు. అందులో ఏడుగురు ఒకవైపు, బెల్లంకొండ శ్రీను ఒకవైపు. అదీ ఫ్రేమ్. ఆ ఏడుగురు తాడు లాగుతుంటే… మన బెల్లం బాబుగారు మాత్రం తాడు మీద కాలు వేసి ఆపడం జరిగింది. దానికి చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టడం. ఇదంతా చూసి నెటిజన్స్ అబ్బో అనుకుంటున్నారు. 75 సెకన్ల ప్రోమోలోనే ఇంత దారుణం ఉంటే. మరి రెండు గంటల షోలో ఇలాంటి ఇంకెన్ని దారుణాలు ఉంటాయో చూడాలి మరి.బాలీవుడ్ వెళ్లి అక్కడ ఎదో చేద్దాం అనుకుంటున్న సమయంలో ఇలాంటి ‘ఓవర్ రియలిస్టిక్’ సీన్స్ చేసి అభిమానుల ముందు పెడితే బాగుండదేమో బెల్లంకొండ సర్.. కాస్త ఆలోచించుకోండి అంటూ నెటిజన్ల సలహాలు ఇస్తున్నారు.
ఇప్పటికే బెల్లం బాబుకు యాక్టింగ్ రాదనీ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి చేస్తే ఊరుకుంటారా? ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి