అందుకే ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది. కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు సినీ ప్రముఖులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రవీనా టాండన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. అయితే ఇటీవలే కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తాను ఈ సినిమా కథ వినేంతవరకు కూడా కేజీఎఫ్ సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.
కే జి ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ ను కలిసేంత వరకు కూడా కే జి ఎఫ్ సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్. దర్శకుడు ప్రశాంత్ నీల్ నా దగ్గరికి వచ్చి స్టోరీలైన్ చెప్పినా పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ చెప్పడంతో ఫిదా అయ్యానని వెంటనే ఓకే చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సైన్ చేసిన తర్వాత కే జి ఎఫ్ సినిమా చూశానని ఇక ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చింది రవీనాటాండన్. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో తన పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి