జబర్దస్త్ కాన్సెప్ట్ లానే జీ తెలుగులో ఏర్పాటు చేసిన అదిరింది షోలో కొన్నాళ్లు స్కిట్స్ చేశాడు ఆర్పి. జబర్దస్త్ లో అందరితో పాటు అతని స్కిట్స్ కూడా క్లిక్ అయ్యేవి కాని అదిరిందిలో ఆర్పి పెద్దగా తన మార్క్ చూపించలేకపోయాడు. అందుకే ఆర్పి తర్వాత అదిరింది షోలో కనిపించలేదు. అదిరింది కాస్త బొమ్మ అదిరిందిగా మార్చారు.. అయినా సరే పెద్దగా రెస్పన్స్ రావట్లేదని తెలుస్తుంది. ఈటివి జబర్దస్త్ కు మరో ప్లస్ పాయింట్ షో లైవ్ లో మిస్సైనా సరే యూట్యూబ్ లో చూసేస్తారు. కాని జీ తెలుగులో వచ్చే అదిరింది, బొమ్మ అదిరింది అలా కాదు యూట్యూబ్ లో కాకుండా జీ ఫైవ్ యాప్ లో ఈ షోస్ వస్తాయి.
అవి కూడా జీ 5 సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా అదిరింది షో ఫెయిల్యూర్ అవడానికి కారణమని అంటున్నారు. ఇక రెండు మూడు వారాలుగా బొమ్మ అదిరింది షో రన్ అవ్వట్లేదు. ఇక ఈ షోని కూడా అటకెక్కించారని టాక్ వస్తుంది. ఏది ఏమైనా జబర్దస్త్ ను బ్రేక్ చేసే మరో కామెడీ షో రాదు.. రాలేదని మరోసారి ప్రూవ్ అయ్యిందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి