ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మన ఫేవరెట్ స్టార్ హీరోలు లాక్ డౌన్ వల్ల చాలా వరకు మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా వరుస సినిమాలను ఫిక్స్  చేసుకున్నారు. వీలైనంత వరకు ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం రెండు సినిమాలతో రావాలని అనుకుంటున్నారు. 2020లో సినిమాలు చేయని  హీరోలైతే స్పీడ్ గా రెండు సినిమాలతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా తరువాత ఏ దర్శకుడితో సినిమా తీస్తాడు అనే  విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో రూపొందుతున్న"ఆచార్య" సినిమాలో ఒక పాత్రలో అయితే ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉందని క్లారిటీ వచ్చేసింది.

అయితే సోలోగా ఎవరితో సినిమా చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ముందుగా జెర్సీ డైరెక్టర్ కథ అయితే వినిపించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే రామ్ చరణ్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ లను కలపాలని చూస్తోంది. అంటే మొత్తంగా చరణ్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో కలుపుకొని ఆల్ మోస్ట్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టినట్లు చెప్పవచ్చు.ఇక ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా చరణ్ రెండు సినిమాలతో రవచ్చని తెలుస్తోంది. ఆచార్య ఈ సమ్మర్ కు వస్తుండగా ఆ తరువాత దసరాకు  "ఆర్ ఆర్ ఆర్" రావచ్చని అంటున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: