కొన్ని రోజుల కిందట వివాహ బంధంతో సింగర్ సునీత,
బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లికి ఎంతో అంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ పెళ్లిని సునీత పిల్లలే దగ్గరుండి మరీ అంగరంగ వైభవంగా జరిపించడం విశేషం. కాగా సునీత పెళ్లే సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతుంటే మరికొందరు గిట్టని వారు విమర్శలు కురిపిస్తున్నారు. సునీత రెండో
పెళ్లి చేసుకోవడం ఏమిటీ.. ఈ ఏజ్ లో అవసరమా సునీతకు
పెళ్లి ..అంటూ నెగిటీవ్ కామెంట్లు చేస్తున్నారు కొందరు.

అలాంటి వాటిని సహించలేక మెగా బ్రదర్ విమర్శకులకు కొంచెం ఘాటుగానే కౌంటర్ వేశాడు. ఈ దెబ్బతో అందరి నోళ్లకు మూతపడ్డాయనే అనుకోవచ్చు..‘సంతోషమనేది పుట్టుకతో రాదు. దాన్ని మనమే వెతుక్కోవాలి. అందులో భాగంగానే సునీత,
రామ్ లు తమ సంతోషాన్ని తామే వెతుకున్నారు. మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు అని కామెంట్ చేశారు నాగబాబు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి .. కొన్నింటిని ఎంచుకోవడానికి.. కొందరు వెనకడుగు వేస్తుంటారు.. అలాంటి సిగ్గుపడేవారికి మీ జంటే ఉదాహరణగా నిలిచింది.
ప్రేమ, సంతోషం అనేవే పర్మినెంట్ అడ్రస్ గా ఉంటాయి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నాగబాబు
రామ్, సునీతలను తన
ట్విట్టర్ ద్వారా విష్ చేశాడు. కాగా
రామ్ వీరపనేనితో లైఫ్ సంతోషంగా ఉండబోతుందని సునీత భావిస్తోంది. ఈ మధ్యనే
పెళ్లి చేసుకున్న ఈ జంట హనీమూన్ కోసం ఏ ప్లేస్ ను ఎంచుకున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మందినే ఈ పెళ్లికి ఇన్వైట్ చేశారు. కాగా సుమారుగా ఈ వివాహానికి 200 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. పెళ్లికి హాజరు కాని తన స్నేహితులకు సునీత చిన్న
పార్టీ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.