భాషలకు అతీతంగా అందరిని అలరించేందుకు ఈ సినిమా సిద్దమవుతోంది. రేపు ఉదయం 10.08 గంటలకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ‘కథలు భాషలతో సంబంధం అయి ఉండే కాలం పోయింది. ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ద్వారా, అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, అవి మీకు ఎలాంటి ఫీలింగ్‌ను కలగజేస్తున్నాయన్నాయి అనేదే ఇప్పుడు ఆధారం. ఇప్పటి వరకు అనేక కథలను మీ ముందుకు తీసుకువచ్చాం. ప్రాంతంతో సంబంధం లేకుండా అందరిని అలరించేందుకు ప్రయత్నించాం. రేపు మా ప్రయాణంలో మరో చాప్టర్‌ను జత చేయబోతున్నాం. భాష అనే బేధాన్ని పక్కన పెట్టి కొత్త ఏజ్ ఆఫ్ సినిమాను తీసుకురాబోతున్నాం’ అంటూ నిర్మాణ సంస్థలు చెప్పుకొచ్చాయి.
కాగా.. విజయ్ దేవరకొండ చివరగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయంగా మిగిలింది. దీంతో ఫైటర్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని రౌడీ బాయ్ విజయ్ కసితో ఉన్నాడు. ఫైటర్ చిత్రం విజయ్‌కు మంచి హిట్‌ను ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి