త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ సినిమా మొదలుకాకుండానే.. ఆ తర్వాత తీసే సినిమాల గురించి చర్చ నడుస్తోంది. చింజీవిని డైరెక్ట్ చేస్తాడని కొందరంటే.. కాదు కాదు రామ్‌చరణ్‌తో సినిమా ఉంటుందంటున్నారు మరికొందరు. కాదు కాదు.. ఓ యంగ్ హీరోతో కమిట్‌ అయ్యాడన్న టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్‌ ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్‌ను ఊరిస్తున్నాడు.

త్రివిక్రమ్‌ ఇప్పటివరకు 11 సినిమాలను డైరెక్ట్‌ చేస్తే.. రెండు తప్ప 9 సినిమాలను స్టార్స్‌తో తీశాడు. నువ్వే నువ్వే.. అఆ మినహా అన్ని సినిమాల్లో కథానాయకులుగా స్టార్స్‌నే ఎంచుకున్నాడు. త్వరలో డైరెక్ట్‌ చేయబోతున్న 12వ సినిమాలో ఎన్టీఆర్‌ హీరో. ఇక 13వ సినిమా హీరోగా రామ్ పేరు వినిపిస్తోంది. రెడ్‌ ప్రీ రిలీజ్‌లో స్రవంతి రవికిషోర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మాట్లల్లో విన్న తర్వాత  త్రివిక్రమ్‌ రామ్‌ కాంబోలో సినిమా ఉంటుందన్న వార్త చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ జాబితాలో చిరంజీవి.. రామ్‌చరణ్‌ కూడా ఉన్నారు. జై చిరంజీవా సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు రాశాడు. చిరంజీవితో ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌ సినిమా కంటే ముందే ఎనౌన్స్‌ చేశారు. త్రివిక్రమ్‌ లిస్ట్‌లో వెంకటేశ్‌ కూడా ఉన్నాడు. మల్లీశ్వరి.. నువ్వునాకు నచ్చావ్‌.. వాసు సినిమాకు మాటలు రాసిన త్రివిక్రమ్‌ వెంకటేశ్‌ను డైరెక్ట్‌ చేయాలనుకున్నాడు. అయితే... ఆయన లిస్ట్‌లో క్రేజీ స్టార్స్‌ వచ్చి చేరడంతో... వెంకటేశ్‌, త్రివిక్రమ్ మూవీ గురించి టాపిక్కే రావడం లేదు.

త్రివిక్రమ్‌తో మూవీని చిరంజీవి ఎనౌన్స్‌ చేసేశాడు. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమాను నిర్మాత  ప్రకటించారు. ఇంతవరకు ఎవరూ చెప్పకపోయినా.. త్రివిక్రమ్‌, రామ్‌చరణ్‌ కలయికలో సినిమా వుంటుందన్న న్యూస్‌ చాలాకాలంగా వస్తోంది. ఇలా తారక్‌ మూవీ తర్వాత  త్రివిక్రమ్‌ ఖాతాలో నలుగురు హీరోలు ఉన్నారు. వీళ్లల్లో ఎవరిన్ని సెలెక్ట్‌ చేసుకున్నా.. ముందు తారక్‌తో మూవీ పూర్తికావాల్సిందే. మొత్తానికి త్రివిక్రమ్ కోసం నలుగురు హీరోలు వెయిటింగ్ లో ఉన్నారు. చూద్దాం.. ఎవరెవరికి అవకాశం దక్కుతుందో..











మరింత సమాచారం తెలుసుకోండి: