అయితే మోనాల్ అన్న కామెంట్స్ ను మీడియా వక్రీకరించిందని అంటుంది హారిక. బిగ్ బాస్ 4లో తన ఎంట్రీ సాంగ్ లో ఓ షార్ట్ డ్రెస్ ఇచ్చారని.. బహుశా దాని గురించి మోనాల్ అలా మాట్లాడి ఉండొచ్చని అన్నది హారిక. ఇక తన కాస్టూంస్ విషయంలో వస్తున్న కామెంట్స్ ను తను చాలా లైట్ తీసుకుంటున్నట్టు చెప్పింది హారిక. సీజన్ 4 లో టాప్ 5లో స్థానం సంపాదించిన హారిక ఓ యూట్యూబర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
బిగ్ బాస్ కు ముందు.. బిగ్ బాస్ తర్వాత హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. హీరోయిన్ గా చేయాలని ఉందన్న హారికకు శర్వానంద్ శ్రీకారం సినిమాలో ఒక మంచి పాత్ర దొరికినట్టు టాక్. మొత్తానికి హారిక కూడా అదరగొట్టబోతుందని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి