ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. అన్ని చోట్ల మంచి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల  చేయడానికి ప్లాన్  చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ‘క్రాక్’ సినిమా ఓటీటీలోకి విడుదల అవ్వబోతుందట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ‘ఆహా’ యాప్.. రిపబ్లిక్ డే కానుకగా సినిమాను ప్రసారం చేయాలని చూస్తుంది. ఇప్పటివరకు ‘ఆహా’ చేసిన అన్నింటిలో ‘క్రాక్’ సినిమానే పెద్ద డీల్ అట.

దాదాపు 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది ‘ఆహా’. అయితే ఠాగూర్ మధుకు ఈ మొత్తం డబ్బుని ఇవ్వలేదట. రకరకాల ఆబ్లిగేషన్లు, మరికొన్ని ప్రాజెక్ట్ లను లింక్ పెట్టి.. ‘క్రాక్’ సినిమా డీల్ ను లాక్ చేశారట అల్లు అరవింద్. అంతేకాకుండా.. థియేటర్లోకి వచ్చిన మూడు వారాలకే ఓటీటీలో సినిమా పెట్టుకునేలా అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నారట. ఇందులో భాగంగా ‘క్రాక్’ సినిమాను వీలైనంత త్వరగా ఆహాలో విడుదల చెయ్యాలని  భావిస్తున్నారు అల్లు అరవింద్.

జనవరి 26న ‘క్రాక్’ను ఆహాలో రిలీజ్ చేయాలని  ఒక ఆలోచన. అలానే వీకెండ్ తో పాటు వాలెంటైన్స్ డే కలిసొచ్చేలా.. ఫిబ్రవరి 12వ తేదీన స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది మరో ఆలోచన. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ నెలలోనే స్ట్రీమింగ్ కి తీసుకొస్తే బాగుంటుందనే కోరుకుంటున్నారట. మరి ఈ విషయంలో అల్లు అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి! ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: