ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....కామెడీ కింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్... గత కొంతకాలంగా అల్లరి నరేష్ కి సరైన హిట్ లేక సతమాతమవుతున్నాడు. తాజాగా   అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న  "బంగారు బుల్లోడు" సినిమా పేరు తగ్గట్లుగానే బంగారం చుట్టూనే తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. రీసంట్ గా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్యాంక్ లో బంగారాన్ని ఎక్కువ వడ్డీకి ఇస్తూ అల్లరి నరేష్ అండ్ కామెడీ గ్యాంగ్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ బ్యాంక్ ఎంప్లాయిగా పనిచేస్తూ బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకి వాడుకుంటున్నట్లుగా ట్రైలర్ లో చూపించడం జరిగింది.

అంతేకాదు, చివర్లో  బంగారం పోయినట్లుగా, దానికోసం పోలీస్ ఎంక్వైరీ అంటూ ట్రైలర్ ని ఆసక్తిగా మలవడం జరిగింది. అల్లరి నరేష్ సినిమాల్లో ఉండే కామెడీ టైమింగ్ తో పాటుగా, హీరోయిన్ అందాలు కూడా ఈసారి సినిమాకి అడ్వాంటేజ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ లో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. అది గుళ్లో పులిహోర టైప్ కాదు, ప్యారడైజ్ బిర్యాని విత్ ఎక్స్ ట్రా లెగ్ పీస్ తెలుసా అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో హాస్యాన్ని పందించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇక టోటల్  గా "బంగారు బుల్లోడు"  ట్రైలర్ చూస్తుంటే పండగ వెళ్లిపోయినా కూడా పండగ వినోదాన్ని పంచే సినిమాలాగానే కనిపిస్తోంది. మరి చూద్దాం.. ఈ "బంగారు బుల్లోడు" సినిమాతో అల్లరి నరేష్  సూపర్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలంటే ఈ సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.కాని ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అయ్యేలానే అనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: