అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా ఈ నెల 23న రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత సాంగ్ రిలీజ్ చేశారు. బాలయ్య టైటిల్ ను మాత్రమే కాదు ఆ సినిమాలో సాంగ్ కూడ వాడేశాడు అల్లరోడు. బాలయ్యని మిగతా ఏ నందమూరి హీరోలు కూడా వాడుకోని విధంగా బంగారు బుల్లోడు కోసం అల్లరి నరేష్ వాడుకున్నాడు.
ఒకప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసిన అల్లరి నరేష్ కొద్దిపాటి గ్యాప్ తో వస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సాయి కార్తిక్ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల క్రితం మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాతో సత్తా చాటనున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాంది సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. బంగారు బుల్లోడు సినిమాతో అల్లరి నరేష్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. ఈ టైటిల్ ఇచ్చినందుకు అల్లరి నరెష్ బాలయ్యకు థ్యాంక్స్ చెప్పాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి