ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని  తాజాగా నటించిన సినిమా ‘రెడ్’ 8వ రోజున కూడా మంచి వసూళ్ళని రాబట్టడం జరిగింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి క్లాస్ హిట్  ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ హిట్ ఇలా రెండు  బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి దూకుడు మీద  ఉన్న రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి హాట్ బ్యూటీలు  ఈ సినిమాలో  హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే రాబట్టడం జరిగింది...

విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘రెడ్’ చిత్రం 8 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే
‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.39 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 2.7 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. గురువారం రోజున కూడా ఈ చిత్రం 0.34 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక లాక్ డౌన్ తరువాత అది కూడా కేవలం 50 శాతం ఆక్యూపెన్సితో ఈ రకంగా వసూలు చెయ్యడం అంటే విశేషం అని చెప్పాలి. ఇక రెండు వరుస హిట్లతో మంచి జోష్ లో వున్న మనోడికి ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్ హిట్ లభించింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: