ఈ ప్రశ్న కొంతమందిని వేధిస్తున్నమాట నిజమే. ఎందుకంటే, కవిగా రచయితగా నటుడిగా తనికెళ్ల భరణికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి వాళ్లలో ఆశలు రేకెత్తిస్తూ భరణి ‘మిథునం’ అనే సినిమాని తెరకి ఎక్కించారు. ఎంతో పాపులర్ కథతో నిర్మించిన ఈ సినిమా ఆడియో విడుదలై చాలా రోజులైంది. సినిమా ఎప్పట్లో విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి.
నిజానికి షూటింగ్ కూడా అయిపోయి కొన్ని ప్రదర్శనలు కూడా అయ్యాయి. ఆ ప్రదర్శనలకు వచ్చిన పంపిణిదారులు చూసి బాగుందన్నారు కానీ, థియేటర్లలో ప్రదర్శించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ చిత్రంలో రెండే పాత్రలు ఉండటం... అవీ ఎస్పీ బాలు, లక్ష్మి పోషించడం... లాంటివి మార్కెట్కి సరిపోవని వాళ్లంటున్నారు. నిజానికి భరణికి ఉన్న మార్కెట్ ని వాళ్లు అంచనా వేయడం లేదు. మంచి సినిమాలకి ఇలాంటి కష్టాలు మామూలే. ఏదో ఒకరోజు ‘మిథునం’ థియేటర్స్ కి రావాలని కోరుకుందాం.
మరింత సమాచారం తెలుసుకోండి: