మహేష్ బాబుతో సినిమా అంటే మాటలా... భారీ బడ్జెట్... పెద్ద మార్కెట్... ఆ అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. ఒకసారి మహేష్ ఎవరినైనా ఇష్టపడ్డారంటే మరి వదలరు. మొదట్లో థమన్ సంగీతాన్ని ఇష్టపడిన ప్రిన్స్ ఆ తరవాత వరుసగా తన సినిమాలకు థమన్ నే పెట్టుకున్నారు.
మహేష్ లానే దర్శకుడు సుకుమార్ కి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. దేవిశ్రీకి సుకుమార్ కొత్త కాకపోవచ్చుకానీ... మహేష్ మాత్రం కొత్తే. ఎందుకంటే, వాళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే.
అందుకే, మహేష్ ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని దేవిశ్రీ రాత్రింబవళ్లూ కష్టపడి ట్యూన్లు తయారుచేస్తున్నాడట. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సరికొత్తగా పాటలను అందించేందుకు యుద్ధప్రాతిపదికనే పనిచేస్తున్నాడట.
మరింత సమాచారం తెలుసుకోండి: