అయితే ఇటీవల విజయ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఒక డిజైన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యింది. డిజైన్ తో షాక్ ఇవ్వడమే కాకుండా రేటుతో కూడా దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇచ్చారు.ఇక నెటిజనులు వీర లెవల్ లో కామెంట్స్ చేస్తూ విజయ్ ని ఆడుకుంటున్నారు.సాధారణంగా విజయ్ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసే క్రమంలో మిడిల్ క్లాస్ వంటి వారికి అందుబాటులో ఉండే ధరను ఫిక్స్ చేసినట్లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా విడుదల చేసిన ‘రౌడీ వేర్’ బ్రాండ్ డెనిమ్ జీన్స్, జాకెట్ డిజైన్ ధరలు అలా లేకపోవడంతో ట్రోల్స్ వస్తున్నాయి. పైగా మిగిలిపోయిన బట్ట ముక్కలన్ని కలిపి కుట్టినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. డెనిమ్ జాకెట్ ధర సుమారు రూ.25లు కాగా, డెనిమ్ జీన్స్ రూ.15వేలు అంటూ ట్యాగ్స్ ఇచ్చారు.

దీంతో మధ్య తరగతి వాళ్ళు వాటిని కొనేంత దమ్ముందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో విజయ్ వేసుకున్న చాలా డ్రెస్సులపై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇక అభిమానులు చాలా వరకు రౌడి వేర్ డిజైనర్ ను మార్చుకుంటే బావుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి