గంగవ్వకు బిగ్ బాస్ నిర్వాహకులు ఆరు గదుల ఇల్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆరు గదులు ఇల్లు, రెండు బెడ్ రూం లు.. పెద్ద హాల్ తో గంగవ్వ ఇల్లు ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే గంగవ్వ తన ఇంటి పనులకు సంబందించిన వీడియోని రిలీజ్ చేసింది. గంగవ్వ తన కొత్త ఇంటి కట్టిస్తున్నందుకు బిగ్ బాస్ వారికి కృతజంతలు తెలుపుతుంది. బిగ్ బాస్ స్టేజ్ మీద ఇచ్చిన మాట ప్రకారం గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
ఆరు గదులు, రెండు బెడ్ మ్లు.. గంగవ్వకు పెద్ద ఇల్లు కట్టిస్తున్నారు. సీజన్ 4లో ఎంటర్టైన్ చేసినందుకు ఆమెకు తగిన కానుక ఇస్తున్నారని చెప్పొచ్చు. సొంతింటి కోరికని బిగ్ బాస్ ద్వారా నెరవేర్చుకున్న గంగవ్వ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా ఆమె ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ నిండి వచ్చాక గంగవ్వ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని ప్రేక్షకులను అలరిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి