తన నటనతో,అందంతో ఎందరో అగ్ర హీరోల సరసన మెప్పించి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు చాలా భాషల్లో శ్రీదేవి తన సత్తా చాటింది. ఛార్మి, తమన్నా, హన్సిక, శ్వేతా బసు ప్రసాద్, సాయేషా సైగల్ నందిత రాజ్, కృతి శెట్టి 20 సంవత్సరాల లోపు వయస్సు లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు.ఛార్మి 15ఏళ్ళ వయస్సులోనే 'నీతోడు కావాలి' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మిల్కి బ్యూటీ తమన్నా కూడా 15 ఏళ్ళ ప్రాయంలోనే 'చంద్ర సార్ ఓషన్' అనే సినిమాలో నటించింది.ఇక దేశముదురు సినిమాలో బన్నీ జోడీగా మెప్పించిన హన్సిక కూడా 16 వ ఏట ఇండస్ట్రీకి వచ్చింది.
కొత్త బంగారులోకం సినిమాలో వరుణ్ సందేశ్ సరసన నటించిన శ్వేతా బసు ప్రసాద్ 17 వ ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తాజాగా ఉప్పెన సినిమాలో వైష్ణవ తేజ్ కి జోడీ కట్టిన కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ లు కొట్టేసింది..ఉప్పెన సినిమాలో కృతి శెట్టి తన అందంతో పాటు చక్కటి నటనతో అందరిని ఆకట్టుకుంది..ఇక తాజాగా ఈ నయా బ్యూటీ కి రామ్ సరసన నటించే అవకాశం దక్కింది.. లింగుస్వామి, రామ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి