హీరో మహేష్‌బాబుతో పాటుగా లేడీ అమితాబ్ అనే టైటిల్‌కి తగ్గట్టుగా విజయశాంతిని ఓ గొప్ప క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు అనిల్. అంతే కాకుండా విజయశాంతికున్న ఫాలోయింగ్‌ని, పాపులారిటీని క్యాష్ చేసుకోవడంతోపాటు సినిమాకి క్రేజ్ తీసుకొచ్చే పనిలో భాగంగా ఆమెను పబ్లిసిటీలో కూడా బాగా ఉపయోగించుకున్నాడు.ఇక, `సరిలేరు నీకెవ్వరు` ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి.. విజయశాంతిని ప్రశంసించడంతో `లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అగైన్` అన్న సంకేతాలు పరిశ్రమకి అందాయి.
ఆ సినిమా తర్వాత ఎన్నో కథలు, మరెన్నో క్యారెక్టర్స్ లేడీ అమితాబ్ ముందు కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. కానీ ఎంత పెద్ద పారితోషకం ఆఫర్ చేసినా ఆమె ఆమె ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ముందుగా విజయశాంతినే సంప్రదించారు. విజయశాంతికి దేవ కట్టా కథను కూడా వినిపించాడు. ఆ పాత్ర చేయమని చాలా రిక్వస్ట్ చేశారు. కానీ ఆ పాత్ర తనకున్న ఇమేజ్‌కి సరిపోదని విజయశాంతి ఒప్పుకోలేదు. దీంతో `బాహుబలి` క్వీన్ రమ్యకృష్ణ అయితే కొంతవరకూ పాత్రకు న్యాయం జరుగుతుందని ఆమెను సంప్రదించారు..దానికి రమ్యకృష్ణ కూడా కథ నచ్చి ఒకే చెప్పిందట...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి