ఎలక్షన్స్ వచ్చే వరకు ఎన్ని సినిమాలు వీలుకైతే అన్ని సినిమాలు చేయాలనీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే.. ఈ నాలుగు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మరో కథకి కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సినిమాకి కమర్షియల్ హంగులు ఉన్న కథలో అనుకున్న స్థాయిలో దమ్ములేకపోవడంతో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గబ్బర్ సింగ్ క్యారెక్టర్ మీద మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇంకా ఇప్పటికి ఆసక్తి తగ్గలేదు అని తెలుస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ తో మరో సీక్వెల్ ప్లాన్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందని అయన భావిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్. దీని బాధ్యత ని కిషోర్ పార్ధ సారధి కి అప్పగించారట.గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసిన కిషోర్ పార్ధశాని దీన్ని ఏలెవెల్లో రాస్తారో చూడాలి. సర్దార్ గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా రాజా సర్దార్ గబ్బర్ సింగ్ స్టొరీ లైన్ చెప్పి దాని మీద వర్క్ అవుట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయాలని దర్శకుడు డాలీకి చెప్పినట్లు బోగట్టా.ఇప్పుడు దర్శకుడు కూడా అదే పనిలో ఉన్నాడని, స్క్రిప్ట్ ఫైనల్ అయితే అతనితో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి