ఏప్రిల్ 8 సమీపిస్తుంటే సుకుమార్ లో టెన్షన్ పెరిగిపోతుంది. గతంలో మాదిరిగా కాకుండా అనుకున్న సమయం కంటే ముందుగానే సినిమా పూర్తి చేయాల్సి రావడం... సుక్కుకు ఛాలెంజ్ గా మారిపోయింది.

సుకుమార్ ఎలాంటి ఫిలిం చేసినా రాజమౌళి మాదిరిగా కాస్త టైమ్ తీసుకునే షూట్ చేస్తూ ఉంటాడు. మరీ ఎక్కువగా సీన్లు చుట్టేడయం కూడా సుకుమార్ కు ముందు నుంచి అలవాటు. ఆ ఇదితోనే అతని సినిమాలన్నీ కంప్లీట్
కావడానికి కాస్త లేట్ అవుతూ ఉంటుంది. తాజాగా పుష్ప సినిమా మ్యాటర్లోనూ ఇదే మ్యాటర్ కనిపిస్తుందేమో అనుకున్నారంత. కానీ అలాంటి వాటికి చోటివ్వకుండానే సీన్ మార్చిపడేశాడు. ఎంత త్వరగా షూట్ అయితే అంత మంచిదన్నట్లుగా అతని వ్యవహార శైలి ఉంది.

ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే.ఆ రోజు పుష్ప ఫిలిం టీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా అందివ్వాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ఆగస్ట్ 13న రిలీజ్ కావల్సిన సినిమా తాలుకు టాకీ పార్ట్ పు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం లెక్కల మాస్టారుకు కాస్త ఇబ్బందిగా ఉందట. రానున్న రోజుల్లో ఈ టెన్షన్ మరింత పెరుగుతుందనే అనుమానంతో ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూళ్లు పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోనూ ఓ షెడ్యూల్ చేశారు. దాదాపు సగం సినిమా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం తమిళనాడులోని టెన్‌కాశిలో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఈ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని తన కూతురి శారీ ఫంక్షన్ లో పాల్గొని వెళ్లాడు. అక్కడి ఓ పల్లెటూరిలో హీరో  కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇక సినిమా రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో మేకర్స్ లేరు.ఈ విషయాన్ని సుక్కుకు స్పష్టం చేయడంతో స్టఫ్ మెయిన్ టైన్ చేస్తూ అవుట్ పుట్ తేవడం చాలా కష్టంగా మారిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఇన్ సమయానికి పూర్తి కావచ్చు. లేదంటే రెండువారాలు లేట్ కావచ్చు. బట్ ఏప్రిల్ 8కు మాత్రం బన్నీ బర్త్ డే టీజర్ గా పుష్పరాజ్ అలరించే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: