టాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ గతేడాది "భీష్మ " సినిమాతో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో గుర్తుండిపోయే హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత పెళ్లి చేసుకోని ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్..ఇక మన యూత్‌ స్టార్‌ నితిన్‌ భీష్మ వంటి హిట్ తరువాత క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో "చెక్ " సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించాడు.హాట్ బ్యూటీస్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం… ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో చూసినప్పుడు టాక్ అంతా బాగానే వుంది.  ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ డౌన్ అవుతూ వస్తోంది.ఘోరమైన కలెక్షన్లని రాబడుతుంది.


ఇక చెక్ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి వారం పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఎంత వసూలు చేసిందంటే ఒక్క మొదటి రోజు మినహా మిగతా 6 రోజులు చాలా తక్కువ వసూళ్ళని రాబట్టింది ఈ చిత్రం.'చెక్' చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బుధవారం నాడు ఈ చిత్రం కేవలం 0.14 కోట్ల షేర్ ను రాబట్టింది. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఫైనల్ గా ఈ చిత్రం డిజాస్టర్ లిస్ట్ లోకి చేరేలా ఉంది. ఈ వీకెండ్ కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి.. 'చెక్' క్యాష్ చేసుకునే అవకాశం లేదనే చెప్పాలి.దీంతో భీష్మ వంటి హిట్ తరువాత నితిన్ చెక్ రూపంలో ప్లాప్ ని మూటగాట్టుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: