టాలీవుడ్ యంగ్ హీరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అల్లుడు సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి సినిమా "ఎ1 ఎక్స్ ప్రెస్ ". సందీప్ కిషన్ కి జంటగా హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటించింది ఈ సినిమాలో.డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి నిర్మాతలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూర్తిగా హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ సింగర్ ‘ధృవ’ ఫేమ్ హిప్ అప్ తమిజా సంగీత దర్శకుడు గా పని చేశాడు.ఇతను కంపోజ్ చేసిన ‘సింగిల్ కింగులం’ అనే పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం బోలెడంత క్రేజ్ ఏర్పడేలా చేసింది.


మార్చి 5న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ విషయానికి వస్తే....‘ఎ1 ఎక్స్ ప్రెస్’ సినిమాకి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా 0.81 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 4.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా సినిమాలున్నప్పటికీ ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది.ఇక గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న  సందీప్ కిషన్ కి ఈసారి ఈ సారి ఈ సినిమాతో మంచి హిట్ లభించింది. చూడాలి ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ఇక ఎంత వసూలు చేస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: