సినిమా పరిశ్రమ తీరే అంతే. ఒకరు ఎందుకు వద్దంటారో తెలియదు, మరొకరు ఎందుకు అవకాశం ఇస్తారో చెప్పలేం. ఇలాంటి పరిస్థితినే సమంత ప్రస్తుతం ఎదుర్కొంటుంది. రామ్ చరణ్ హీరోగా రూపొందే చిత్రం నుంచి సమంతాను తప్పించారు. అయితే ఎన్టీఆర్ హీరోగా హరీష్  శంకర్ రూపొందించే సినిమాలో హీరోయిన్ గా సమంతా ఎంపిక అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. బాబాయ్ తో సమంత జోడీ కట్టడం కారణంగానే రామ్ చరణ్ సినిమా నుంచి సమంతాను తప్పిచినట్లు, తనతో కలిసి నటించిన బృందావనం సినిమా హిట్ అవ్వడంతో సమంతను మళ్లీ తన జంటగా ఎన్టీఆర్ తీసుకున్నట్లు అంతా బావిస్తున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ తో హరీష శంకర్ రూపొందించే సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2013 జనవరిలో ప్రారంభించి ఆ ఏడాది దసరాలో విడుదల చేయాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: