కింగ్
నాగార్జున సినిమాలో నల్ల దుస్తుల్లో
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మెరవనుంది.
టాలీవుడ్ మన్మధుడు
నాగార్జున చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ లో
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏ ఈ
సినిమా ప్రముఖ దర్శకుడు
ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందుకు
నాగార్జున ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు వినికిడి. అంతేకాదు...
కాజల్ ఈ చిత్రంలో
రా ఏజెంట్ గా చేస్తోందట, ఆ పాత్ర కోసం ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఆ పాత్ర కోసం పలు రకాల గన్స్ ను ఎలా వాడాలి ? ఎలా పట్టుకోవాలి ? అనే విషయమై వర్క్ షాప్ లో బిజీగా ఉన్నారట కాజల్.
రా ఏజెంట్ మరియు
ఆర్మీ చుట్టూ అల్లుకున్న ఈ కథలో నాగ్ మరియు
కాజల్ అగర్వాల్ లు జంటగా నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఇదే కనుక నిజమైతే కన్నుల
పండుగ అంటున్నారు నెటిజన్లు. మరోవైపు
అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగ్ మరియు
కాజల్ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ 150 లో ప్రేక్షకులను మెప్పించిన కాజల్... ఇప్పుడు ఈ సీనియర్ హీరోతో కూడా అలరిస్తుందని నమ్ముతున్నారు.
విభిన్న చిత్రాల దర్శకుడు
ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి కూడా ఓకే చెప్పారని... ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని,
హీరోయిన్ కాజల్ కూడా ఈ చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్ ను కొద్దిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే
హీరో నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతుంది. అయితే నాగ్ తదుపరి ప్రాజెక్టు..బంగార్రాజు చిత్ర షూటింగ్ మొదలు పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పాత్రను చేయడం
కాజల్ కు ఇదే మొదటి సారి. మరి ఎలా మెప్పిస్తుందో చూడాలి.