అయితే కరోనా తరువాత వచ్చిన సినిమాలలో తాను ఎక్కువగా నటించిన సినిమాలు లేవనే చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది. కానీ సినిమాలలో లాగా సోషల్ మీడియాలో చీర కట్టులో ఉంటుంది అనుకుంటే పొరపాటే..సినిమా వేరు..నిజ జీవితం వేరు..కాబట్టి ఇక్కడ తనకు నచ్చినట్లు ఉంటుంది. ఈమె మోడరన్ డ్రెస్సులను ధరించి..తన కూతురితో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈమె ఇంస్టాగ్రామ్ వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈమె కూతురిని కూడా మోడర్న్ గానే పెంచుతున్నట్లు ఉంది. దీనితో నిత్యం ఏదో ఒక గాసిప్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలు పెద్దగా లేవు. దీనికి కారణం చూస్తే ఈమె పై వస్తున్న గాసిప్ లే కారణంగా తెలుస్తోంది. ఇంతకు ముందే చాలా సార్లు ఈమె పై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ఈమె తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈమెకున్న పరిచయాలతో సుప్రీతకు అవకాశాలు అయితే రావొచ్చు, కానీ ఆ తరువాత పూర్తిగా తన టాలెంటు మీదే ఆధారపడి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి