ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా అని అంటున్నారు . చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇది దాదాపు ఒక సంవత్సరం పైనే అయింది వచ్చి. కానీ 2020 లోనే దీని కథ కంచిక చేరుతుంది అనుకుంటే, ఈ ఏడాది కూడా నీడలా వెంటాడుతూనే అందరికీ చెమటలు పట్టిస్తోంది. ఈ కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ మాస్కుల తోనే దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు కరచాలనం కూడా ఇచ్చుకోవడం మానేశారు. మన పాశ్చాత పద్ధతి అయినటువంటి నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తున్నారు.
మన జన జీవన శైలిని మార్చేసిన ఈ మాయదారి కరోనా అంత ఈజీగా జనాలను వదిలేలా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం పోరాడుతూనే ఉన్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కరోనాకు సంబంధించిన ఒక వీడియో 30 ఏళ్ల క్రితమే సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈ కరోనా నియంత్రణ కోసం పాటించే చర్యలతో కూడినటువంటి ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కరోనా ను దూరం పెట్టేందుకు పాటించే అన్నింటినీ చూపించారు. ముఖ్యంగా బాబీ డియోల్ ఆర్ ఆర్ టి పీ ఆర్ సీ పరీక్ష చేస్తున్నట్లుగా నటి ఐశ్వర్యరాయ్ ముక్కులో బడ్ పెట్టడం, క్వారంటైన్ కు వెళుతున్నట్లుగా తలుపు వేసుకుని గదిలోకి ఉండటం, భౌతిక దూరాన్ని పాటించడం , చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి సన్నివేశాలు అన్నీ ఫన్నీ గా ఉన్నాయి. బాబీ డియోల్ నటించిన కొన్ని సినిమాల్లోని వీడియో క్లిప్ లను అన్నింటిని ఈ వీడియోలో చేర్చి సరికొత్త వీడియోను సృష్టించారు కొందరు మీయర్స్. అందరూ తెగ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ముఖ్యంగా కరోనా కు సంబంధించిన అన్ని విషయాలను చేర్చడం గమనార్హం. ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చక్కగా చూపించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా ఒకసారి చేసేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి