టాలీవుడ్ హీరో యూత్ స్టార్ నితిన్ గతేడాది "భీష్మ" సినిమాతో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ ఏడాది ఎన్నో భారీ అంచనాలతో "చెక్ " "రంగ్ దే" సినిమాలతో ప్రేక్షకులని నిరాశ పరిచాడు.ఇక దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్లో 'పవర్ పేట' అనే సినిమా తెరకెక్కనున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఛల్ మోహన రంగ' సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ దర్శకుడిపై ఉన్న నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు నితిన్. కృష్ణ చైతన్య చెప్పిన పొలిటికల్ టచ్ ఉన్న 'పవర్ పేట' కథ నితిన్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను మూడు భాగాలుగా తీస్తారని అన్నారు.ఆ తరువాత రెండు భాగాలుగా సెట్ చేశారని ప్రచారం జరిగింది.


ప్రస్తుతం 'అంధాధూన్' సినిమా రీమేక్ లో నటిస్తోన్న నితిన్.. తన తదుపరి చిత్రంగా 'పవర్ పేట' మొదలుపెడతారని అంతా అనుకున్నారు.ఇటీవల వక్కంతం వంశీ చెప్పిన కథ నితిన్ కి నచ్చడంతో ముందుగా వంశీ సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడట. 'నా పేరు సూర్య' సినిమా తరువాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఈసారి కథను మరింత పకడ్బందీగా రాసుకొని సినిమా మొదలుపెట్టబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.ఇక ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: