కేవలం పవన్ అభిమానుల్లోనే కాకుండా ప్రతీ ప్రేక్షకుడికి 'వకీల్ సాబ్' సినిమాని మొదటిరోజు మొదటి ఆట చూడాలని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లుగానే మొదటి షో తో భారీ హిట్ పడిందనే టాక్ వినిపిస్తుంది. యూత్ లో పవన్ లు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ఈ రేంజు లో టాక్ ను అందించింది..వకీల్ సాబ్' బెఫిట్ షోస్‌లో నానా హంగామా చేశారు. ముఖ్యంగా 'వకీల్ సాబ్' నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ అభిమానిగా థియేటర్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిర్మాతన్న విషయం కూడా మర్చిపోయి పవన్ స్క్రీన్ మీద కనిపించగానే పేపర్లు ఎగరవేసి నానా రచ్చ చేశాడట..
ఇకపోతే తాజాగా ఈ చిత్ర దర్శకుడు షాక్ ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరాం బయట పెట్టాడు. బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన 'పింక్' సినిమానే తెలుగులో పవర్ స్టార్‌తో 'వకీల్ సాబ్'గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ 'వకీల్ సాబ్' గనక పవన్ కళ్యాణ్ నో అంటే మాత్రం ఈ సినిమాకి నెక్స్ట్ ఆప్షన్‌గా టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జునని వేణు శ్రీరాం అనుకున్నట్టుగా తెలిపాడు. అంటే పవర్ స్టార్ నో అంటే అప్పుడు 'వకీల్ సాబ్'లో నాగార్జున టైటిల్ రోల్ చేసుండేవారన్నమాట.. కానీ బయట ఈ వార్త మాత్రం వివిధ రకాలుగా వినిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి