యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో వున్నాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి తారక్ ఖచ్చితంగా పెద్ద పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయమట. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా తర్వాత రెండు, మూడు నెలలు గ్యాప్‌ అయితే పక్కా వస్తుందంటున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా ప్రకటించినప్పటి నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు 'అరవింద సమేత' లాంటి మంచి హిట్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ దర్శకుడు కావడంతో అభిమానులు ఆనందపడ్డారు.వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం అందరికీ కలిగింది. అనుకున్నట్లే త్రివిక్రమ్‌ సినిమా క్యాన్సిల్ అయ్యి ఆగిపోయి… దాని ప్లేస్‌లోకి కొరటాల శివ సినిమా వచ్చింది.


కొరటాల ఎన్టీఆర్ సన్నిహితుడు కావడంతో కథ వినకుండానే హడావుడిగా సినిమా ప్రకటించేశారని ఎవరికైనా చాలా సులభంగానే అర్థమవుతుంది. ఈ క్రమంలో సినిమా పూర్తి కథ సిద్ధం కాలేదట.ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్‌కు తన దగ్గరున్న ఓ సినిమా పాయింట్‌ చెప్పి ఓకే చేసుకున్నాడట. 'ఆచార్య' పనులు పూర్తయ్యాక ఎన్టీఆర్‌ సినిమా పనులు మొదలుపెడతాడు. 'ఆచార్య' పనులు అవ్వడానికి, ఎన్టీఆర్‌ కోసం పూర్తి కథ సిద్ధం చేసుకోవడానికి కనీసం మూడు, నాలుగు నెలలు అయితే పడుతుంది. మరి ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ ఏం చేస్తాడు అనేదే ఇక్కడ ప్రశ్నగా మారింది. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తాను ఈమధ్య ప్రకటించిన "ఎవరు మీలో కోటేశ్వరులు" షో ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడట. ఆ లోపు కొరటాల ఎన్టీఆర్ కోసం మంచి కథను సిద్ధం చేసుకొని వస్తే ఆది చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట మన యంగ్ టైగర్.మరి చూడాలి ఎన్టీఆర్ ప్లాన్ ఎలా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: