కేవలం నవీన్ పొలిశెట్టి విజయాన్ని సాధించడమే కాదు చిత్ర పరిశ్రమ లోకి రావాలి అంటే కేవలం సినీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉండాలి అని లేకపోతే రాణించడం కష్టం అని నిరాశ చెందుతున్న ఎంతోమందిలో కొత్త ఊపిరి నింపాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే నవీన్ పోలిశెట్టి అటు నిజజీవితంలో కూడా జాతిరత్నాలు సినిమాలోని జోగిపేట్ శ్రీకాంత్ పాత్రలో లాగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తనకు ప్రభాస్ క్లోజ్ అని బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పి మొన్న ట్రైలర్ రిలీజ్ సమయంలో కలిసాము అంటూ ట్విస్ట్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.
ఇక ఇటీవల ఇలాంటి ఒక ట్విస్ట్ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి.ఇటీవలే దగ్గుబాటి వారసుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు నవీన్ పొలిశెట్టి. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జాతి రత్నాలు లోని ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నవీన్ పొలిశెట్టి లు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు ప్లే చేయగా తనకు రానా ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అని స్కూల్ మేట్ అని.. తనకు ముందుగా బాహుబలిలో ఆఫర్ వస్తే ఇక తన ఫ్రెండ్ రానాకు చేయమని నేను ఇచ్చాను అంటూ చెబుతాడు నవీన్ పోలిశెట్టి. ఇక నవీన్ పోలిశెట్టి డైలాగ్స్ వింటూ అందరూ తెగ నవ్వుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి