ఈ రోజు ఉదయం పరిస్థితి మరింత విషమించడంతో చనిపోయారు. ఈమె మరాఠీ పరిశ్రమలో ప్రముఖ దర్శకురాలి గానే కాకుండా నిర్మాతగా కాకుండా పలు సినిమాలను నిర్మించి ఎంతో సేవ చేశారు. ఈమె పరిశ్రమకు వచ్చిన తరువాత మరాఠీ సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. సుమిత్ర భవే ఎక్కువగా దర్శకుడు సునీల్ సుక్తాంకర్ తో కలిసి పని చేసింది. వీరిద్దరి కలయికలో మొత్తం 17 సినిమాలు రూపుదిద్దుకున్నాయి. సినిమాలకు రాక ముందుగా 50 కి పైగా షాట్ ఫిలిమ్స్ ని కూడా రూపొందించారు. మరాఠీలో నాలుగు టెలివిజన్ సీరియల్స్ ను కూడా తీయడం జరిగింది.
వీరిద్దరూ మరాఠీ సినిమా పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలకు గానూ ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. 2016 సంవత్సరంలో వీరు తెరకెక్కించిన కాసవ్ అనే సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డును పొందడం జరిగింది. ఇంత ప్రతిభ కలిగిన సుమిత్ర భవే మరణించడంతో మరాఠీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మరి కొంత మంది ఆప్తులు మరియు సన్నిహితులు ఈమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి