త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న 'పవర్ పేట' కూడా పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా. ఇప్పుడు ఇదే ఊపులో నితిన్ మరో కొత్త సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్.తెలుగులో 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్.. నితిన్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది.ఇందులో నితిన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
కథ ప్రకారం నితిన్ కి బ్రదర్ ఉంటాడని.. అతడు కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. అంటే సినిమాలో ఇద్దరు హీరోలన్నమాట. ఈ ప్రాజెక్ట్ పై నితిన్ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. 'మాస్ట్రో' సినిమా పూర్తయిన తరువాత 'పవర్ పేట' సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఆ తరువాతే v RAGHAV' target='_blank' title='మహి వి రాఘవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహి వి రాఘవ్ సినిమా ఉంటుందని సమాచారం అందింది. ఇక చూడాలి మరి ప్రయోగాల బాట పట్టిన నితిన్ హిట్స్ అందుకుంటాడో లేదో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి