ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతుంటారు. ఏ అంశం గురించి అయినా ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చెప్పేస్తారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ్మ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసారు. సినిమావాళ్లకు రాజ‌కీయాలు ప‌నికిరావ‌ని తేల్చేశారు. యాంకర్ ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ హాస‌న్, కుష్బూ, లాంటి ప్ర‌ముఖ న‌టులు ఓడిపోయారు దానిపై మీ స్పంద‌నేంట‌ని ప్రశ్నించ‌గా తమ్మారెడ్డి మాట్లాడుతూ....సినిమా వాళ్ల‌కు రాజ‌కీయాలు ప‌నికిరావు ఒక్క రామారావుగారు మాత్ర‌మే రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయ్యారు. సినిమా వాళ్ల‌ది నాలుగు గోడ‌ల మ‌ధ్య గాజుగ‌దిలో ఉండే బ్ర‌తుక‌ని...చెమ‌ట ప‌ట్టినా ఒక‌డు వ‌చ్చి తూడుస్తాడ‌ని అన్నారు. సినిమాలో చెప్పేడైలాగులే ప్ర‌పంచం కాద‌న్నారు. ఒక్క‌సారి పోటీ చేసి గెల‌వాగానే మ‌నిషికో పార్టీ పెట్టేస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక మ‌ద్రాస్ లో అయితే మ‌రీ దారుణ‌ని శ‌ర‌త్ కుమార్, క‌మల్ హాస‌న్ మ‌రికొంద‌రు న‌టులు పార్టీలు పెట్టేసుకున్నార‌ని కానీ ఎవ‌రూ గెల‌వ‌రని అన్నారు. 

త‌మిళ‌నాడులో అస‌లు బీజేపీ ప్ర‌భావం లేద‌ని అలాంటి పార్టీలోకి కుష్బు వెళ్లింద‌ని అలాంట‌ప్పుడు ఎలా గెలుస్తుందని అన్నారు. ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రాకుండా స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని..కానీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నాన‌ని ర‌జినీ ప‌దే ప‌దే చెప్ప‌డం చివ‌రికి భ‌య‌పడి పారిపోవ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. ఇక ప్ర‌స్తుతం వ‌చ్చిన ఓటీటీల ప్ర‌భావం పై కూడా త‌మ్మారెడ్డి స్పందించారు. ఓటీటీ అనేది ఒక స‌ప‌రేట్ బిజినెస్ అని అన్నారు. ఓటీటీ వ‌ల్ల కొత్త రెవ‌న్యూ వ‌స్తుంద‌ని అంతే కాకుండా కొత్త వారికి అవ‌కాశాలు కూడా వస్తాయ‌ని తెలిపారు. తాను కూడా ఓటీటీలో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాన‌ని ఇప్ప‌టికే ప‌లు స్క్రిప్ట్ ల‌ను పరిశీలించాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా అంటున్నార‌ని కానీ నాగార్జున పాన్ ఇండియా గురించి ర‌చ్చ‌బండ సినిమా టైంలోనే చెప్పార‌ని అన్నారు. సురేష్ బాబు కూడా ఎప్పుడో పాన్ ఇండియా గురించి మాట్లాడార‌ని అన్నారు. నాగార్జున సురేష్ బాబు ఇద్ద‌రూ మంచి విజిన‌రీస్ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: