అయితే శ్రీదేవి ఊహించనివిధంగా 2018 ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా చనిపోవడంతో ఓ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందాల్సిన చిత్రం ఆగిపోయిందన్న విషయం చాలామందికి తెలియదు. శ్రీదేవి చనిపోవడానికి ముందు ఆరునెలల క్రితం సంజయ్‌దత్‌తో శ్రీదేవి కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత శ్రీదేవి, సంజయ్ దత్ వెండితెరపై కలిసి మెరవబోతున్నారన్న వార్తలు అప్పట్లో బాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తించాయి.. నిజానికి ఎప్పుడో 1993లో వచ్చిన ‘గుమ్రా’ చిత్రంలో జంటగా నటించారు సంజయ్‌దత్, శ్రీదేవి. ఆ తరువాత చాన్నాళ్ల తరువాత కరణ్‌జోహార్, సాజిద్ నదియాద్‌వాలా కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో వీరిద్దరూ మరోసారి జోడీ కట్టబోతున్నట్టు అప్పట్లో ప్రచారం సాగింది. ఈ చిత్రంలో నటించేందుకు శ్రీదేవి కూడా ఒప్పుకున్నారట. ఆలియా భట్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్‌లు ఈ చిత్రంలో నటించనున్నారని, సంజయ్ దత్ అప్పట్లో పనిచేస్తున్న ‘భూమి’ చిత్రం తరువాత ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లబోతున్నట్టు ప్రచారం సాగింది. అయితే అదే సమయంలో శ్రీదేవి అభిమానులను శోకసంద్రంలో ముంచి లోకాన్ని వీడటంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి