ఇలా మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని తన అకౌంట్లో వేసుకున్న అట్లీ ఆ తర్వాత యాక్షన్ హీరో విజయ్ తో పోలీసోడు, అదిరింది, విజిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలు డైరెక్ట్ చేశారు. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు తెరకెక్కించడంతో అట్లీ ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఇలా స్టార్ హీరోలతో వరుస చిత్రాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు అట్లీ . ప్రస్తుతం అట్లీ బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌తో ఓ మూవీ చేయబోతున్నారు. ఇటు తెలుగులో యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో భారీ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినికిడి. ఇప్పటికే ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపించారని స్టోరీలైన్ బాగా నచ్చడంతో తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు చెబుతున్నారు.
ప్రేక్షకులకు నచ్చే పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ని ఎంచుకొని సరికొత్తగా రూపు దిద్దడంలో పేరు ప్రఖ్యాతులు పొందారు అట్లీ. ఒక యువ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తమిళ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అట్లీ సినిమాలో కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకుని తెరకెక్కిస్తూ ఉంటాడు. ముందుగా కథ, స్క్రీన్ ప్లే ని అధ్బుతంగా మలుచుకుంటాడు. తరువాత తన సినిమాలో హీరోకి అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ను హైలైట్ చేస్తాడు. సినిమా ఆద్యంతం ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. చాలా తక్కువ వయసులోనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి