ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ను అందించారు. ఈ సినిమాలోని పాటకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను ఈ నెల 31 న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇది నిజంగానే మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కాగా, ఇటీవలే ఈ సినిమాలోని మహేష్ బాబు ఫ్రీ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం.
ఇకపోతే ఈ సినిమా బ్యాంకింగ్ రంగాల వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా, కీర్తి సురేష్ అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగినిగా కనిపించనుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. మహేష్ బాబు లోని మరో యాంగిల్ ను పరుశురాం జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం మహేష్ బాబు పాత్ర చుట్టూ కామెడీ ట్రాక్ ఉంటుందని తాజా అప్ డేట్ లో తెలిసింది.ఈ సినిమాలో పరశురాం ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కామెడీ ట్రాక్ ను చూపించనున్నాడట.. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్ గా కనిపించనున్నాడని టాక్.భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వరుస ప్రాజెక్టులకు సైన్ చేసిన సంగతి తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి