ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల 25వ సినిమా విశేషాల గురించి ఓ లుక్కేద్దాం.
2. ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన 25వ సినిమాగా "జైత్రయాత్ర" చేశారు. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో నాగ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
3. నందమూరి వారసుడు బాలకృష్ణ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న "నిప్పులాంటిమనిషి". ఎస్. బి. చక్రవర్తి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో బాలయ్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
4. యూత్ ఐకాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ పవన్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది.
ఇలా ఈ అయిదు హీరోల 25 వ సినిమాల ఫలితాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి