టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదటి సినిమా అ! తోనే తన ప్రతిభ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్న ప్రసాంత్ వర్మ ఆ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తో తీసిన కల్కి తో పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన జాంబి రెడ్డి సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ అందుకుంది. తెలుగులో మొదటి జాంబి జోనర్ మూవీగా ప్రశాంత్ వర్మ మరోసారి తన టాలెంట్ చూపించాడు. ఇక ఇప్పుడు అతని డైరక్షన్ లో హనుమాన్ అంటూ ఇండియన్ సూపర్ హీరో కథతో వస్తున్నాడు.

ఈసారి ప్రశాంత్ వర్మ తన కథకు క్లాసిక్ టచ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. హనుమాన్ టైటిల్ తోనే ఓ వైబ్రేషన్స్ ఏర్పరచిన డైరక్టర్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన వీడియోతో అంచనాలు పెంచాడు. ప్రశాంత్ ప్రతిభ తెలిసిన ఎవరైనా సరే హనుమాన్ ను తక్కువ అంచనా వేయలేరు. తప్పకుండా హనుమాన్ మూవీ ప్రశాంత్ తీసిన మూడు సినిమాలకు మించి ఉంటుందని చెప్పుకోవచ్చు.

హనుమాన్ సినిమా కాస్టింగ్ ఫైనల్ కావాల్సి ఉంది. జాంబి రెడ్డి సినిమాలో నటించిన తేజా సజ్జానే హనుమాన్ సినిమాలో లీడ్ రోల్ చేస్తాడని టాక్. ప్రశాంత్ వర్మ హనుమాన్ ప్రాజెక్ట్ ను కూడా చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే ప్రశాంత్ వర్మ తెలుగు సినిమాకు మరో రాజమౌళిగా మారాడని కొందరు చెబుతున్నారు. ఇలానే ప్రయోగాలు చేస్తూ ఉంటే ప్రశాంత్ వర్మకు స్టార్ డైరక్టర్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ అంతా సైలెంట్ గా జరిగింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: