సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు కూడా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే మల్టీస్టారర్ మూవీస్ లో నటించాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ కొన్ని సినిమాలలో త్రిపాత్రాభినయం తో నటించి , అందరినీ అలరించారు. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1). కుమార రాజా:డైరెక్టర్ సాంబశివరావు దర్శకత్వంలో 1978 లో కృష్ణ, జయంతి, లత, జయప్రద వంటి వారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కృష్ణ పేర్లు విజయ్ రాఘవ భూపతి, మరియు కుమార్, రాజా అని త్రిపాత్రాభినయం తో అందరినీ అలరించారు సూపర్ స్టార్ కృష్ణ. అంతే కాకుండా ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగా రాబట్టింది.


2). పగబట్టిన సింహం:బి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం పగబట్టిన సింహం.ఇందులో హరికృష్ణ, మోహన కృష్ణ ,ముద్దు కృష్ణ వంటి పాత్రలతో త్రిపాత్రాభినయం చేసి అందరినీ అలరించారు కృష్ణ. ఇందులో హీరోయిన్లు జయప్రద, ప్రభ,గీత.


3). సిరిపురం మొనగాడు:కె .ఎస్ .ఆర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చిత్రం సిరిపురం. ఇందులో కృష్ణ గారి పేర్లు లయన్, శ్రీధర్, ఆనంద్ అని మూడు పాత్రలు చేసి, అందరిని అలరించాడు. ఇక ఇందులో హీరోయిన్ లు జయప్రద, కె. ఆర్. విజయలు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.


4). బంగారు కాపురం:పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చిత్రం బంగారు కాపురం.ఈ చిత్రంలో కృష్ణ గారు గోపి,కృష్ణ,రాజా రవీంద్ర అనే మూడు పాత్రల్లో నటించి అందరినీ అలరించారు. ఇందులో కథానాయకులుగా జయసుధ,జయప్రద నటించారు.

5) రక్త సంబంధాలు:ఏ .మల్లికార్జున్ రావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చిత్రం రక్త సంబంధాలు.ఈ చిత్రంలో కృష్ణ గారు చక్రవర్తి, కృష్ణ, విజయ్ అనే మూడు పాత్రలు చేసి అందరిని మెప్పించాడు. ఇందులో కథానాయకులుగా మంజుల, అంజలీదేవి, పండరీబాయి నటించారు.

6). బొబ్బిలి దొర:కామేశ్వరరావు బోయపాటి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చిత్రం బొబ్బిలి దొర . ఈ  చిత్రంలో కృష్ణ గారు హరిచంద్ర ప్రసాద్, శరత్ చంద్ర ప్రసాద్, కృష్ణ ప్రసాద్ ఈ మూడు పాత్రలు చేసి అభిమానులను ఎంతగానో మైమరిపించేలా చేశాడు  సూపర్ స్టార్ కృష్ణ. ఇందులో హీరోయిన్ గా సంఘవి నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: