టాలీవుడ్ డైరక్టర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరించే దర్శకులు కొందరైతే కేవలం తమకు తెలిసిన మాస్ అండ్ కమర్షియల్ పంథాలో సినిమాలు చేస్తూ మెప్పించే దర్శకులు కొందరు ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీను స్టైల్ సెపరేట్ అని చెప్పాలి. బోయపాటి స్టార్ స్టార్ కెమెరా యాక్షన్ అని చెప్పాడంటే చాలు రక్తపాతం జరగాల్సిందే. కథ ఏదైనా.. హీరో ఎవరైనా బోయపాటి సినిమా అంటే వయిలెన్స్ అదిరిపోవాల్సిందే.

మొదటి సినిమా భద్ర నుండి రాబోయే అఖండ వరకు బోయపాటి శ్రీను సినిమా అనగానే ఆడియెన్స్ మైండ్ లో ఒక ఫార్మెట్ ఫిక్స్ అయ్యి ఉంటారు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ పక్కా.. అంతేకాదు ఆ యాక్షన్ కు తగినట్టుగా మ్యూజిక్ డైరక్టర్ నుండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా రాబట్టుకుంటాడు. బోయపాటి శ్రీను సినిమాకు ముందు ఇమేజ్ ఎలా ఉన్నా ఆయన డైరక్షన్ లో సినిమా చేసిన తర్వాత మాత్రం మాస్ ఇమేజ్ రాకమానదు.

ప్రస్తుతం బాలకృష్ణతో చేస్తున్న అఖండ సినిమాలో కూడా మాస్ ఆడియెన్స్ ను ఏమాత్రం నిరాశపరచకుండా సినిమా ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య మార్క్ నట గంభీరత్వంతో పాటుగా బోయపాటి మార్క్ మాస్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే తమిళ హీరో సూర్యతో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని తెలుస్తుంది. సూర్యతో బోయపాటి శ్రీను తీసే మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వస్తుందని టాక్. ఈ సినిమాని కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: