ఘట్టమనేని శివరామకృష్ణ.. ఇక మన సినీ పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణగా సుపరిచితులు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత ,దర్శకుడు అలాగే రచయిత కూడా. ఈయన రచించిన ఎన్నో రచనలు అప్పట్లో మంచి ప్రసిద్ధి కూడా పొందాయి. ఇక 2009వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి తన రచనల కోసం పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. దాదాపు 50 సంవత్సరాల పాటు కొనసాగిన తన సినీ జీవితంలో,  సుమారు 350 చిత్రాలకు పైగా నటించి సంచలనం సృష్టించారు. ఇక తన జీవితంలో ముఖ్యంగా 1997లో ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకోవడం విశేషం. 1989 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ 1965 వ సంవత్సరంలో తేనెమనసులు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొట్ట మొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం (ఈనాడు) లో కూడా హీరో ఈయనే. మొదటి సినిమా స్కోప్ చిత్రం (అల్లూరి సీతారామరాజు) కూడా ఇయనిదే. అంతేకాదు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ కూడా కృష్ణగారే. ఇలా ఎన్నో సంచలనాలు సృష్టించి, ఈయన తీసిన ఎన్నో సినిమాలలో ఒకటైన " గడసరి అత్త సొగసరి కోడలు " సినిమా కూడా ఈ రోజుకి 40 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.
1981 వ సంవత్సరం జూన్ 20వ తేదీన కట్టా సుబ్బారావు గారి దర్శకత్వంలో , రాధా క్రియేషన్స్ పతాకంపై సోమిశెట్టి సుబ్బారావు, గోరంట్ల వీరయ్య చౌదరి నిర్మాతలుగా వ్యవహరించగా , సూపర్ స్టార్ కృష్ణ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం "గడసరి అత్త సొగసరి కోడలు". ఈ చిత్రానికి పినిశెట్టి కథ రాయగా, కాశీవిశ్వనాథ్ ఆయన కథకు  మాటలు రాశారు. ఇందులో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ గారు గడసరి అత్త పాత్రలో నటించగా, అతిలోక సుందరి శ్రీదేవి సొగసరి కోడలు పాత్రలో నటించి, అందరిని మెప్పించారు. ఈ  సినిమాలో కథానాయకుడిగా కృష్ణ  నటించారు. ఇక ఈ చిత్రం అప్పట్లో విజయవంతమయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

భానుమతి, శ్రీ దేవి ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక ఇందులో వరలక్ష్మి , రమాప్రభ, శకుంతల , పి.ఎల్.నారాయణ, మమత, కాకరాల, రాజబాబు, జె.వి.రమణమూర్తి వంటి ప్రముఖులు ఇతర పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: