యువ హీరో సంతోష్ శోభన్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది. తను నేను, పేపర్ బోయ్ సినిమాలు చేసినా ఫలితాలు నిరాశపరచాయి. రీసెంట్ గా వచ్చిన ఏక్ మిని కథ సినిమా సర్ ప్రైజ్ హిట్ కొట్టింది. ఓటిటి లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని. వెరైటీ కథతో ఏక్ మిని కథ సినిమాతో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్నాడు సంతోష్ శోభన్.

అలా హిట్టు పడ్డదో లేదో ఇలా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఆల్రెడీ సంతోష్ శోభన్ నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో సినిమా సైన్ చేశాడు ఈ యువ హీరో. ఈసారి కుర్రాడి ఖాతాలో ఓ మెగా ప్రాజెక్ట్ వచ్చి చేరింది.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్న సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. తమిళంలో సూపర్ హిట్టైన 8 తోట్టకల్ సినిమా తెలుగు రీమేక్ లో సంతోష్ శోభన్ నటిస్తున్నాడట. ఈ సినిమాలో హీరో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మాత్రుక దర్శకుడు శ్రీ గణేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

నందిని రెడ్డి సినిమాను వైజయంతి బ్యానర్ నిర్మిస్తుంది. సంతోష్ శోభన్ చేస్తున్న రెండు సినిమాలు పెద్ద బ్యానర్ లో రానున్నాయి. సుస్మిత నిర్మిస్తున్న సినిమాకు మెగా సపోర్ట్ పక్కా ఉంటుంది. సో చూస్తుంటే సంతోష్ శోభన్ రాబోయే రోజుల్లో పాపులర్ యాక్టర్ గా మారే ఛాన్సులు ఉన్నాయని అనిపిస్తుంది. ఏక్ మిని కథ హిట్ సంతోష్ శోభన్ కు మంచి అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఇక చేస్తున్న రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టైనా సంతోష్ ట్రాక్ లోకి వచ్చినట్టే. ఐదారేళ్లుగా హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ హీరో ఫైనల్ గా ప్రేక్షకుల మెప్పు పొందాడని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: