అలా సింహాద్రి సినిమా మొదట బాలకృష్ణకు చెప్పగా ఆయన కాదన్నాక ఎన్.టి.ఆర్ దగ్గరకు వచ్చింది. సింహాద్రి సినిమా ఎన్.టి.ఆర్ కెరియర్ లో మైన్ స్టోన్ మూవీగా నిలిచింది. సినిమాలో ఎన్.టి.ఆర్ ఉగ్రరూపం నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకులను అలరించింది. సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన భూమిక, అంకిత నటించారు. కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అప్పట్లో సింహాద్రి సాంగ్స్ మ్యూజిక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అప్పటికే ఎన్.టి.ఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 తీసిన రాజమౌళి సింహాద్రితో మరో హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో యమదొంగ సినిమా కూడా వచ్చింది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాజమౌళి కాంబో సినిమా అంటే అది రికార్డులు సృష్టించడం పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అని తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ ఏ కథ రాసినా అందులో ముందు ఎన్.టి.ఆర్ ను ఊహించుకుంటాడట రాజమౌళి. ఆయనకు సూటయ్యే పాత్ర అయితే అతనికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాడని తెలుస్తుంది. అందుకే ఎన్.టి.ఆర్ రాజమౌళి ఫ్యామిలీని తన ఫ్యామిలీ అంటుంటాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి