బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన సోహైల్ స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడిని కలిశాడు. వీరిద్దరి కలయిక ఆడియెన్స్ లో ఎక్సయిటింగ్ కు గురి చేస్తుంది. బిగ్ బాస్ లవర్ అనీల్ రావిపుడి సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చి మరి షోకి తను రెగ్యులర్ ఫాలోవర్ అని చెప్పాడు. షో అనాలసిస్ చేయడంలో కూడా అనీల్ రావిపుడికి మంచి టాలెంట్ ఉందట. అందుకే ఆయన్ను షోకి పిలిచి అప్పుడు హంగామా చేయించారు.

ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ సోహైల్ తో అనీల్ రావిపుడి మీటింగ్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరు ఎందుకు కలిశారు అంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ ఊరకనే అనీల్ రావిపుడి సర్ ని కలిశానని సోహైల్ చెబుతున్నా వారి మధ్య ఏదైనా సినిమా చర్చలు జరుగుతున్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనీల్ రావిపుడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుందని అంటున్నారు.

సోహైల్ హీరోగా ఆల్రెడీ ఓ సినిమా మొదలైంది. బిగ్ బాస్ టైం లోనే అనీల్ రావిపుడి సోహైల్ కు ఛాన్స్ ఇస్తానని అన్నాడు. సోహైల్ కూడా అనీల్ రావిపుడి సినిమాలో ఛాన్స్ వస్తే బిగ్ బాస్ టైటిల్ కూడా వద్దని చెప్పాడు. మొత్తానికి అలా బిగ్ బాస్ వల్ల స్టార్ డైరక్టర్ కి టచ్ లోకి వెల్లాడు సోహైల్. సోహైల్ కు సూటయ్యే పాత్ర తన సినిమాలో ఉంటే నెక్స్ట్ మినిట్ వీరిద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. సోహైల్ కూడా తనకు వచ్చే ప్రతి ఛాన్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోగా క్లిక్ అయితే సోహైల్ కథ వేరే ఉండేలా ఉంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్ ను పెంచుకునేందుకు సోహైల్ మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: