ఆర్.ఆర్.ఆర్ కన్నా ముందే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు యంగ్ టైగర్. అదెలా అంటే ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ మరోసారి తన సత్తా చాటనున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ షో హోస్ట్ గా ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద తన స్టామినా చూపించగా ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా మరోసారి స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ షో ఆగష్టులో మొదలవుతుందని తెలుస్తుంది.
ఈ షో కోసం ఎన్.టి.ఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అంతకుముందు స్టార్ మాలో వచ్చిన ఈ షో ఇప్పుడు జెమిని టీవీలో రానుంది. సన్ నెట్ వర్క్స్ ఈసారి ఎవరు మీలో కోటీశ్వరుడు షోని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలంటే షో మొదలవ్వాల్సిందే. ఓ పక్క బిగ్ బాస్ సీజన్ 5 కూడా త్వరలో మొదలవుతుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ షోకి పోటీగా స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ సీజన్ కు హోస్ట్ గా కింగ్ నాగార్జున కొనసాగుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5కి సంబందించిన కంటెస్టంట్స్ ఎంపిక ఓ పక్క శరవేగంగా సాగుతుందని తెలుస్తుంది. ఈసారి సెలబ్రిటీ స్టార్స్ హౌజ్ మేట్స్ గా వస్తారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి