కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినీ పరిశ్రమ మీద బాగా పడ్డది. అందుకే సినీ పెద్దలంతా కలిసి స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సిన్ ప్రక్రియ చేయించారు. ముఖ్యంగా సీసీసీ తరపున మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో తన సపోర్ట్ అందించారు. అపోలో హాస్పిటల్స్ సహకారంతో విడతల వారిగా ఆర్టిస్టులు అందరికి వ్యాక్సిన్ వేయించారు. నాని కూడా లేటెస్ట్ గా వ్యాక్సిన్ తీసుకున్నాడని తెలుస్తుంది. అదే విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానితో పాటు జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాని శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాని కెరియర్ లో ఈ సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్ రెండు సినిమాల మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి