ఇప్పటి వరకు ఓటమై ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు కొరటాల శివ. అందుకే ఈ సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సినిమా క్లైమాక్స్ విషయంలో కొరటాల లాక్ అయ్యారని తెలుస్తోంది. ఎంతటి సినిమాకైనా క్లైమాక్స్ అనేది ఎంత ప్రధానమో తెలిసిందే. అందులోనూ కొరటాల లాంటి డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు అనుకున్న విధంగా కాకుండా, క్లైమాక్స్ ను మార్చినట్లు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇది ఎన్టీఆర్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చే ఎన్టీఆర్ దానికి అంగీకరించారట. అయితే దీని గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ అంచనాలను కొరటాల అందుకుంటాడా ? మరోసారి తన డైరెక్షన్ తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొంతకాలం ఆగక తప్పేలా లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి