టాలీవుడ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర భాషల హీరోలు తెలుగులో ఒకేసారి డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. అలాగే మన టాలీవుడ్ దర్శకులు ఇతర భాషల హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ధనుష్, సూర్య లు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తుండగా మన హీరోలు కూడా తమిళ దర్శకులు శంకర్, లింగు స్వామి ల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ శంకర్ తో, రామ్ పోతినేని లింగుస్వామి తో సినిమాలను అనౌన్స్ చేశారు.

ప్రకటన ఇచ్చేంత వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి ఈ రెండు సినిమాలకు. చరణ్ హీరోగా సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు శంకర్ గత సినిమా పూర్తి చేయకుండా నెక్స్ట్ సినిమా చేయడానికి వీలు లేదంటూ సదరు నిర్మాతలు ఆయన పై పిటిషన్ వేశారు. దాంతో శంకర్ ఆ సినిమాను పూర్తి చేసి గానీ రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టడు. ఇటీవలె ఓకే అయినా రామ్ పోతినేని లింగుస్వామి సినిమా కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. 

లింగస్వామి గత చిత్రమైన సూర్య హీరోగా నటించిన సికిందర్ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా కు ఆయనకు ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయట. ఆ లావాదేవీలు లు పూర్తి కాకముందు మరో సినిమా మొదలు పెట్టడానికి వీలు లేదంటూ ఆయన లింగుస్వామి కి నోటీసులు పంపించారు. మన హీరోలు రెగ్యులర్ గా చేసే దర్శకులతో కాకుండా వెరైటీ సినిమాలు చేసే దర్శకులతో సినిమాలు చేసి మంచి పని చేశారు అని ఆనంద పడుతున్న ప్రేక్షకుల ఆశలు నిరాశ అయ్యేటట్లు ఇప్పుడు ఈ విధమైన అడ్డంకులు రావడం ఈ సినిమాల భవిష్యత్తు పై చాలా ప్రభావం చూపుతుంది అని అంటున్నారు. మరి ఈ వివాదాల నుంచి ఈ రెండు చిత్రాలు ఎలా బయట పడతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: